Friday, June 22, 2007

ఊరేగిస్తా




ఊరేగిస్తా
ఆశలు రేకలుగా మార్చి
నీ దారుల్లో పరుస్తా
నీ సుకుమార పాదాలు కందకుండా
అనురాగం
ఆత్మీయత
స్నేహం
మమకారం
రాజసాలు బోయిలుగా
నా హృదయ పల్లకిలో
ఊరేగిస్తా

Monday, June 18, 2007

నీ తలపు

నీ తలపు

ఓ హిమబిందువై

తొలికిరణంతో

సింధూరమై పలుకరించె

ఆ మేనిలొ వర్ణవదనం

హృదిలో చల్లదనం

నింపె నా మదిని

నవ నందన వనం

నీవు

నీవు

నా వూహ

నా జీవితం

నా కట్టడం

నా సాహిత్యం

నా స్వప్నం

నా ఉత్తేజం

నా ఊపిరి

చిరునవ్వులు

చిరునవ్వులు

నీ చిరునవ్వులు

విరిసిన మరుమల్లెలు

మదిని కురిసిన

తొలకరి జల్లులు.

చెప్పాలనివుంది

చెప్పాలనివుంది

గుండె విప్పాలనివుంది
హౄదయపు లోతులలో
దాచుకున్న
ఊహా రిమళాలను
వెదజల్లాలనివుంది
నవ్విస్తావు
కవ్విస్తావు
వేధిస్తావు
క్రోధిస్తావు
స్పందిస్తావు
అందిస్తావు
బందిస్తావు
లాలిస్తావు
పాలిస్తావు
పగలురేయి అనుకుంటే
కలలోకూడావదలవు
చిరుస్పర్శకే స్పందిస్తావు.